KKR Spinner Varun Chakravarthy Marries His Girlfriend Neha Khedekar | Oneindia Telugu

2020-12-13 24

Kolkata Knight Riders (KKR) star spinner Varun Chakravarthy married his long-time girlfriend Neha Khedekar in a ceremony held in Chennai on Friday
#VarunChakravarthy
#NehaKhedekar
#Kkr
#Kolkataknightriders
#Teamindia
#TNatarajan

కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. చాలా కాలంగా నేహా ఖెడెకర్‌తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్ చక్రవర్తి తాజాగా పెద్దల సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక కేకేఆర్ పంచుకున్న వీడియోలో రిసెప్షన్‌ వేదికపై వరుణ్ చక్రవర్తి బంతి విసరగా.. అతని సతీమణి నేహా బ్యాటింగ్ చేసింది. ఈ వీడియోకు 'వివాహ బంధంతో భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వరుణ్ చక్రవర్తి, నేహా ఖెడెకర్‌కు అభినందనలు.'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.